Friday, January 3, 2025

PDS Rice – పేర్ని నానికి బిగుసుకున్న ఉచ్చు – రేష‌న్ బియ్యం స్కామ్ లో కేసు నమోదు …

రేష‌న్ బియ్యం మాయం కేసులో ఎ6 గా మాజీ మంత్రి
ఏ క్ష‌ణంలోనైనా అరెస్ట్ అయ్యే అవ‌కాశం
ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్
నానీ భార్య ఎ1 నిందితురాలు..
ఇప్ప‌టికే ఈ కేసులో న‌లుగురు అరెస్ట్

మ‌చిలీప‌ట్నం – గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై నేడు పోలీసు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు చేర్చారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పేర్ని నాని పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది.

- Advertisement -

మరోవైపు, ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరయింది. ఈ కేసులో నిందితులుగా గోదాము మేనేజర్ మానస్ తేజ, పౌరసరఫరాల శాఖ. అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగరాజు అరెస్ట్ చేసిన పోలీసులు వారిని . న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వారికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయ‌మూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారిని మచిలీపట్నం సబ్ జైల్ కు త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement