ఏపీలోని పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఇవాళ సచివాలయంలో పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్, ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టు వ్యవహారంపై చర్చించారు. ఈ సందర్భంగా.. ఏపీలోని పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఇక నుంచి ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గోదాముల్లో యంత్రాలను ఎలా ఏర్పాటు చేశారని రాష్ట్ర మంత్రులు మారిటైమ్ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను ప్రశ్నించారు.
సార్టెక్స్ యంత్రాలను ఏర్పాటుపై విచారణ చేపట్టాలని, అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా కాకినాడ పోర్టు భద్రతకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను నియమించాలని నిర్ణయించారు. కాకినాడ పోర్ట్, పరిసర ప్రాంతాలలో రవాణా కార్యకలాపాలు ఉక్కుపాదం మోపనున్నారు.
కాకినాడ పోర్టుకు వెళ్లే లారీల నుంచి అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. అలాగే కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌక జప్తుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.