భాష మార్చుకోకపోతే ప్రజలే పీకే పరిస్థితి వస్తుందని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. పీకేను పీకే ధైర్యం ఉందా ? అని ముఖ్యమంత్రి జగన్ను ప్రశ్నిస్తున్నాను. సీఎంగా ఉన్న వ్యక్తి అలాంటి భాష మాట్లాడకూడదని హితవు పలికారు. ప్రజలు అధికారం ఇచ్చి మూడేళ్లైందని, ఆయన ఏం పీకారో చెప్పాలన్నారు. రాయలసీమలో ఎంతమంది మంత్రులను పీకుతారో చూద్దాం అని వ్యాఖ్యానించారు. మూడేళ్లలో ఒక్క పనైనా సక్రమంగా చేశారా? అని ప్రశ్నించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు పీకడమా మీరు చేసింది అని నిలదీశారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు భాషలో స్వరాన్ని పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి.. ఊహలకు భిన్నంగా కనిపించే సరికి సీఎం జగన్ భాష మారిందని పయ్యావుల వ్యాఖ్యానించారు.
భాష మార్చుకోకపోతే ప్రజలే పీకేస్తారు: సీఎం జగన్ కు పయ్యావుల హెచ్చరిక
Advertisement
తాజా వార్తలు
Advertisement