ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నా మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.. మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. పొత్తుల్లో కొందరు సీట్లు కోల్పోతే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్లు సర్దుబాటు చేయడంతో.. మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే, ఎన్నికల తరుణంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు తిరుపతి అసెంబ్లీ సీటు కేటాయించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇదే ఇప్పుడు జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులను జారీ చేసింది..
అభ్యర్థిని మార్చాలంటూ.. ఓవైపు జనసేన కిరణ్ రాయల్ ఆయన అనుచరులు, మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆమె అనుచురులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, ఈ రోజు తిరుపతిలో కీలమైన పరిమాణాలు జరగనున్నాయి.. నేడు తిరుపతికి వెళ్లనున్నారు జనసేనాని పవన్ కల్యాణ్.. ఆరణి శ్రీనివాసులు మార్చాలంటున్న జనసేన తిరుపత ఇంచార్జ్ కిరణ్ రాయల్‌లో ఆయన సమావేశం కానున్నారు.. మొత్తంగా అసంతృప్తి నేతలతో సమావేశమై.. అంతా ఒకతాటిపైకి వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు పవన్.. మరోవైపు.. ఇప్పటికే చంద్రబాబు.. టీడీపీ నేతలకు సర్దిచెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది.. ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుకు సహాయనిరాకరణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్.. తిరుపతి పర్యటనపై ఆసక్తి నెలకొంది.