Saturday, January 11, 2025

AP | మ‌రికొద్దిసేపట్లో కర్నూలు జిల్లాలో పవన్ పర్యటన

కర్నూలు బ్యూరో : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ‌ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పిన్నాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించనున్నారు. అసియాలోనే పవన, జల, సౌర విద్యుత్ ఉత్పత్తిరంగంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. రూ.15వేల కోట్లతో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మితమవుతున్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఇది. 2022లో మొదలైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది.

ఈ ప్రాజెక్టులో ఇన్ టేక్ వ్యూ పాయింట్, పవర్ హౌస్ దగ్గర నుంచి పరిశీలిస్తారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుపై అధికారులు పవన్ కల్యాణ్‌కు వివరిస్తారు. ఈ ప్రాజెక్టుకు గోరుకల్లు రిజర్వాయర్ నుంచి 1.23 టీఎంసీల నీరు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తవగానే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును సందర్శించినట్లు సమాచారం. ప్రాజెక్టు సందర్శన అనంతరం సాయంత్రం తిరిగి విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు.

- Advertisement -

ప్రాజెక్ట్ ఉద్దేశం ఇది

విద్యుత్ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇందులో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు ఒకటి. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో వీటిని ప్రారంభించింది. వీటిలో భాగంగానే కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలం, గుమ్మటం తండా సమీపంలో ఏర్పాటు చేస్తున్నదే గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్టు ఒకటి. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి. ఇంధన డిమాండి వచ్చినా తీర్చాలన్నదే ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలోని గుమ్మటం తండాలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టు. ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా గుర్తింపబడింది. వీటి కోసం ఏకంగా రూ.30 వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్లు గ్రీన్ కో ప్రకటించింది.

ఇందులో 5,230 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు ఆర్ సి ఐఆర్ ఈఎస్ పీని మే 18, 2022లో స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తొలి దశ పనులు 2023 జులై నాటికి పూర్తవ్వాలి. వీటితో పాటు గ్రీన్కో సంస్థతో కలసి ఇంటిగ్రేటెడ్ వెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ను డెవలప్ చేసింది గత ప్రభుత్వం, జల, పవన, సౌర విద్యుత్ ను ఒకే చోట ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ, దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన ఇందుకు గోరుకల్లు రిజర్వాయర్ నుంచి 1.2 టీఎంసీల నీటిని పసుకొని ఆ నీటిని నిల్వ చేసే నిమిత్తం బ్రాహ్మణపల్లెకు సమీపంలో బోయర్, నంద్యాల జిల్లా పరిధిలోని పిన్నాపురం సమీపంలో అప్పర్ ట్యాంకులను నిర్మించారు.

ఈ నీటిని జల విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం వినియోగించి నీళ్లను ఎగువ జలాశయంలోకి పంపుతారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న టైమ్లో ఆ నీళ్లను దిగువకు పదిలి కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు. తిరిగి ఎగువకు నీటిని మళ్లించి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇందులో స్పెషాలిటీ వీటితో పాటు, కోడుమూరు. ఇతర ప్రాంతాల్లో పవన విద్యుత్ ఉత్పత్తి చేసి అందుకు అనుసంధానించడం వీటి ఉద్దేశం. ఇక ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 23వేల మందికి ఉపాధి లభిస్తుందన్నది అప్పటి ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో భాగంగా కోట్లు ఖర్చు చేస్తూ ప్రాజెక్ట్లను త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. వాస్తవంగా 2023 జూలై నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా, అనుకున్న మేరకు పూర్తికాలేదు. దీంతో 2024 కు పనులను పొడిగించారు.

ఇదీ కథ..

కర్నూలు, నంద్యాల జిల్లాల సరిహాద్దులోని ఓర్వకల్లు మండలం గుమితం తాండ సమీపంలో గ్రీన్, ఎనర్జీ ప్రవేట్ లిమిటెడ్ పరిశ్రమ స్థాపన నిమిత్తం దాదాపు 1800 ఎకరాల భూమిది గత జగన్ ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 1485 ఎకరాల భూమి ప్రభుత్వ, ప్రయివేటకు చెందిన భూమి కాగా, మరో 335 హెక్టార్లు అటవీ భూమికి చెందినది కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement