పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు. ఉదయం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం భీమవరం నియోజకవర్గం ముఖ్య నాయకులతో స్థానిక నిర్మల దేవీ గార్డెన్స్‌లో సమావేశం నిర్వహించారు.
రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుతో పోటీ చేయాల్సిన స్థానాలు, ఎక్కడ పోటీ చేయాలి? ఎక్కడ జనసేన బలంగా ఉంది? అభ్యర్థులు బలంగా ఎక్కడ ఉన్నారు? అన్న దానిపై నేతలతో చర్చిస్తారు. భీమవరం నుండే పవన్ కళ్యాణ్ ఫొటీ చేయాలని నియోజకవర్గ నేతలు కోరుతున్నారు. పవన్ కల్యాణ్ నాన్ లోకల్ కాదు, పక్కా లోకల్. చంద్రబాబు, జగన్ మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు. భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి, ఆయన నివాసం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశామని భీమవరం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ వెల్లడించారు. వాస్తవానికి.. ఈ నెల 14న భీమవరంలో పవన్ పర్యటించాల్సి ఉండగా.. హెలిప్యాడ్ కు అధికారులు అనుమతి నిరాకరించడంతో పర్యటన వాయిదా పడింది.