జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్ముడుపోయాడని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు కుట్రలో భాగంగానే పవన్ సభ అన్నారు. లోకేష్ పాదయాత్రకు యువగళం అని పేరు.. పవన్ సభకు యువశక్తి అని పేరు పెట్టారన్నారు. పవన్ సభ పేరు కూడా టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిందన్నారు. మత్స్యకారుల వలసలపై పవన్ కు అసలు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. పవన్ సభ పేర్లు కూడా టీడీపీనే నిర్ణయిస్తుందన్నారు. జగన్ 9 షిపింగ్ హార్బర్లు కట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు ప్యాకేజీ కోసమే పవన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఎంతసేపూ ఊడిగం చేయడమేనా రాజకీయం అంటే అన్నారు.
- Advertisement -