Monday, June 24, 2024

AP: సచివాలయంలో చంద్రబాబుతో పవన్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతిలోని సచివాలయంలో సమావేశం అయ్యారు. పవన్ కల్యాణ్ బుధవారం మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు. తనకు కేటాయించిన శాఖలకు సంబంధంచిన కీలక వివరాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ మొదటి సారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఉపముఖ్యమంత్రి అయ్యారు. అంతే కాకండా కీలకమైన శాఖలను ఆయనకు కేటాయించారు. ఈ క్రమంలో పవన్, చంద్రబాబు భేటీ పై ఆసక్తి ఏర్పడింది.

పవన్ కల్యాణ్ సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్ ను పరిశీలించారు. అంతకు ముందు విజయవాడలో తన క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. తన కార్యాలయంలోనే ఆయన మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించే అవకాశముంది. పవన్ కల్యాణ్ వెంట జనసేన పార్టీకి చెందిన మరో ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement