Friday, November 22, 2024

AP:చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటి… సీట్ల స‌ర్దుబాట్ల‌పై చ‌ర్చ‌లు …

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి సీఎం జగన్ దూకుడు పెంచగా తాజాగా . విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన అప్రమత్తమయ్యాయి. అమరావతి వేదికగా ఇరు పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు భేటి అయ్యారు.

జ‌న‌సేనాని నేరుగా చంద్ర‌బాబు నివాసానికి వెళ్లారు. అక్క‌డ టిడిపి అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు స్వాగ‌తం ప‌లికారు.. ఆ తర్వాత చంద్ర‌బాబు నాయుడు ఆప్యాయంగా ప‌వ‌న్ ను ఇంటిలోకి ఆహ్వానించారు… ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై చర్చించిస్తున‌ట్లు స‌మాచారం . ఉమ్మడి బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇరు పార్టీల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

కాగా,గత 4 రోజులుగా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడివిడిగా కసరత్తు చేశారు. జనసేన పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే బాబు-పవన్‌ ఓ అవగాహనకు వచ్చారు… అయితే ఎక్కువ స్థానాలు కావాలని పవన్ పట్టుబడుతున్నన్న త‌రుణంలో ఈ భేటికి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లను జనసేనాని ఆశిస్తున్నార‌ని స‌మాచారం .. దీనిపైనే ప్ర‌ధానంగా నేడు చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.. సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తు జరుగుతుండగా ఒకట్రెండు రోజుల్లో టీడీపీ-జనసేన క్లారిటీకి రానుందట. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement