అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు (సోమవారం) ఉదయం పది గంటలకు కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం గుడవర్రు గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పవన్ పరిశీలిస్తారు.
అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం చేరుకుంటారు. అక్కడ రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన పనులను తనిఖీ చేస్తారని డిప్యూటీ సీఎం కార్యాలయం పేర్కొంది. పంచాయతీరాజ్ శాఖ పనులపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేసే దిశగా ఆయన పర్యటిస్తున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులు పనుల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకుంటున్నారు. ఇటీవల మన్యం జిల్లాల్లో డిప్యూటీ సీఎం పర్యటించారు.