ఆ జంట దొరికిందోచ్
వీడిన 9 నెలల మిస్టరీ
దటీజ్ పవర్ స్టార్
అమ్మ కన్నీళ్లకు చలనం
పోలీసులపై ఫైర్ ఫలితం
జమ్మూలో ప్రేమ జంట జాడ
తల్లి గుండెల్లో ఆనందం
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: పోలీసులు తలచుకుంటే ఎంతటి క్లిష్టమైనా… ఆ కేసును ఇట్టే ఛేదించగలరని విజయవాడ పోలీసులు నిరూపించారు. అందులోనూ రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి ఆదేశించగానే… ఉరుకులు పరుగులు పెట్టి మరీ తొమ్మిది నెలల కిందట అదృశ్యమైన ఓ విద్యార్థిని జాడను పట్టేశారు. ప్రేమ పేరిట గల్లంతైన ఈ జంటను జమ్మూ కాశ్మీర్ లో పట్టుకుని విజయవాడకు తీసుకు వస్తున్నారు. ఏపీలో ఆడపిల్లల అదృశ్యంపై ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ఆడబిడ్డల జాడ తెలియటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరీగా ఇదే అంశంపై భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ 9 నెలలుగా తన కుమార్తె కనిపించటం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను వేడుకొంది. ఇందుకు డిప్యూటీ సీఎం చలించిపోయారు. ఈ కేసును సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ఇక స్పందించిన పోలీసులు తమ శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈ జంటను గుర్తించారు. ఇదే పనిని ఆ తల్లి ఫిర్యాదు చేసినప్పుడు స్పందించి ఉంటే.. పోలీసులకు మంచి పేరు వచ్చేది.
అసలేం జరిగిందంటే ?
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రజాదర్భార్ నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ప్రజాదర్భార్‌లో భీమవరానికి చెందిన శివకుమారి పాల్గొన్నారు. విజయవాడలో చదువుతున్న తన కుమార్తె మైనర్ అనీ… ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని పవన్ కల్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. 9 నెలల కిందట తన బిడ్డ అదృశ్యమైందని. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా, పోలీసులు నిర్లక్ష్యం చేశారు. ఎవరికి గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోలేదని , మాచవరం పోలీస్ స్టేషన్ లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించలేని సూర్యకుమారి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు.
జమ్మూలో యువతి గుర్తింపు..
పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు. స్వయంగా డిప్యూటీ సీఎం ఆదేశించడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఇక ఉరుకులు పరుగులు పెట్టారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన ఓ యువకుడుతో కలిసి ఈ యువతి జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. వీద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి విజయవాడకు స్పెషల్ టీం తీసుకు వసస్తోంది. జమ్మూ నుంచి యువతిని తీసుకు వచ్చిన తర్వాత పోలీసులు పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రేమ పేరుతో తీసుకుపోయినా.. ఆ అమ్మాయి మైనర్ అయితే.. తీసుకుపోయిన యువకుడిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే అవకాశం ఉంది. ఇక డిప్యూటీ సీఎం జోక్యంతో విజయవాడ పోలీసుల్లో కదలిక మొదలైంది.
అసలు కథ ఇది…
భీమవరం కు చెందిన తేజస్విని (19)చుట్టుగుంట నివసించే తన పిన్ని వద్ద ఉంటూ మాచవరం నార్ల వారి వీధిలో వున్న యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ లో చదుతుంది. అదే కాలేజీ లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతున్న అంజాద్ (షన్ను )తో ఏర్పడ్డ చనువు ప్రేమగా మారడంతో ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో తేజస్విని తల్లి శివకుమారి మాచవరం పోలీసులకు గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న మాచవరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరిరువురు హైదరాబాదులో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు హైదరాబాదులో చేరుకునే లోపు వారు తమ వద్ద వున్న ఫోన్లు అమ్మేసి కొత్త ఫోన్, కొత్త సిమ్ తీసుకోని వాడటంతో పోలీసుల దర్యాప్తుకు బ్రేక్ పడింది. ఇరువురి పేరెంట్స్ తమకు ఏ సమాచారం తెలియదని చెప్పడంతో కేసు ముందుకి కదల్లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తేజస్విని తల్లి శివకుమారి తన కుమార్తె మిస్సింగ్ కేసు పై పవన్ కళ్యాణ్ కలిసి ఫిర్యాదు చేశారు. ఇంత పవన్ కళ్యాణ్ స్వయంగా మాచవరం సిఐ గుణరాం కు ఫోన్ చేసి కేసు వివరాలను, దర్యాప్తు తీరును అడిగి తెలుసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ పీ హెచ్ డి రామకృష్ణ కు ఫోన్ చేసి మిస్సింగ్ కేసును సమగ్ర దర్యాప్తు చేసి కేసులు చేదించవలసినదిగా ఆదేశించారు. మిస్సింగ్ చేదించడానికి ఇద్దరు ఎస్ఐలతో రెండు టీం లను ఏర్పాటు చేశారు. పోలీసులు విచారణ లో కాల్ డేటా అదారంగా జమ్మూ లో వుంటూ హోటల్ పనిచేస్తునట్టు గుర్తించి అక్కడి పోలీస్ ల సహాయం తో వారిని విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లిన పోలీసులు ప్రత్యేక బృందం ఈరోజురాత్రికి విజయవాడ కు విమానంలో తీసుకురానున్నారు.