Friday, November 22, 2024

AP: అడ‌ప‌డుచుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అదిరిపోయే గిప్ట్…

పిఠాపురం పురూహూతికా దేవాలయంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం
ఇందులో పాల్గొనే మ‌హిళ‌ల‌కు ప‌వ‌న్ చీర‌ల పంపిణీ
మొత్తం 12 వేల చీర‌లు సిద్ధం
ఆల‌యంలో భారీ ఏర్పాట్లు..


అమ‌రావ‌తి – పిఠాపురం ఎమ్మెల్యేనా.. మజాకా నా అన్నట్టుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం. తనను తొలిసారి అసెంబ్లీకి పంపిన పిఠాపురంపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా ఈ శుక్రవారం 12వేల చీరలను పిఠాపురంలోని ఆడపడుచులకు పంచేందుకు అంతా సిద్ధం చేశారు.

సామూహిక వరలక్ష్మి వ్రతం…
ప్రతీ ఏడూ శ్రావణమాసం చివరి శుక్రవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన‌ పిఠాపురంలోని పురూహూతికా దేవాలయంలో పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు ఆడపడుచులు మాతృమూర్తులు. అదే కోవలో ఈ ఏడాది కూడా రేపు 30న సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.

- Advertisement -

ఈ సందర్భంగా వ్రతం కోసం వచ్చే మాతృమూర్తులకు తన సొంత ఖర్చులతో చీరలు పంచేందుకు రంగం సిద్ధం చేశారు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దీని కోసం ఇప్పటికే ఏకంగా 12వేల చీరలను పిఠాపురానికి పంపించారు ఆయన. వాటిలో 6000 చీరలను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం వద్ద పూజ ముగిసిన తర్వాత అందజేస్తారు. మిగిలిన ఆరు వేల చీరలను స్థానిక ఎమ్మెల్యే చేబ్రోలు పార్టీ ఆఫీనులో ఆడపడుచులకు ఇస్తారు.

వరలక్ష్మీ వ్ర‌తానికి భారీ ఏర్పాట్లు..
పురూహూతికా దేవాలయంలో రేపు నిర్వ‌హించే సామూహిక వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తానికి భారీ ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు ఆ ఆలయ ఈవో భవాని వెల్ల‌డించారు. గతంలో లా కాకుండా మరింత విశాలమైన స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. మొత్తం మూడు బ్యాచులుగా మహిళలు ఈ వ్రతాన్ని చేసుకునేందుకు తగిన్ ఏర్పాట్లు చేసినట్టు ఆమె చెప్పారు. మొత్తం మీద ఎమ్మెల్యే గా ఎన్నికైన తొలి ఏడాదే పిఠాపురం మహిళలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చుతో ఏకంగా 12 వేల చీరలను గిప్ట్ గా ఇవ్వ‌నుండ‌టం స్థానికంగా సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement