హైదరాబాద్, ఆంధ్రప్రభ : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారీతీయ సంస్కృతీ సంప్రదాయాలపై దత్తాత్రేయకు ఉన్న మక్కువ తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ప్రతి ఏటా విజయ దశమి రోజున దత్తాత్రేయ నిర్వహించే అలయ్-బలయ్ కార్యక్రమం తనకెంతో ఇష్టమన్నారు. వివాదాలకు దూరంగా చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని గౌరవించే దత్తాత్రేయ నిండు నూరేల్లు వర్దిల్లాలని ఆకాక్షించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.