సంధ్య థియేటర్ తొక్కిసలాటపై స్పందించిన పవన్ కల్యాణ్
అల్లు అర్జున్ లో మానవత్వం లోపించినట్లుంది
జరిగిన సంఘటనపై వెంటనే అర్జున్ స్పందించాల్సిది
భాదిత కుటుంబాన్ని కనీసం అర్జున్ టీమ్ పరామర్శించాలి
అవగాహనా రాహిత్యం.. లోపం స్పష్టంగా కనిపిస్తున్నది
రేవంత్ కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారనడం తప్పు
ఆ స్థాయిని దాటేసిన డైనామిక్ లీడర్
ఈ సంఘటనలో బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అరెస్ట్ తప్పదు
చట్టం ఎవరికీ చట్టం కాదు..
రేవంత్ పాలన బాగానే ఉందంటూ పవన్ ప్రశంసలు
వెలగపూడి – సంధ్య తొక్కిసలాట ప్రమాద ఘటనను గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారంటూ ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.. సినీనటుడు అల్లు అర్జున్ వివాదంపై తొలిసారిగా ఆయన స్పందించారు.. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన నేడు మీడియాతో చిట్ చాట్ చేస్తూ, సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ స్పందిస్తే బాగుండేదని అన్నారు. ఈ ఘటనలో ఎక్కడో మానవత్వం లోపించినట్లు కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు..
అర్జున్ స్పందించకపోవడంతోనే…
అల్లు అర్జున్ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదని అన్నారు. చట్టం అందరికీ సమానమేనని . ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టనని చెప్పారు పవన్. వారు ఎంత సేపే భద్రత గురించి వారు ఆలోచిస్తారని అన్నారు.. థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సిందని,. సీట్లో ఆయన కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సిందని అంటూ . చెప్పినా ఆ అరుపుల్లో ఆయనకు వినిపించలేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు.. అల్లు అర్జున్ తరపున బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేదని, కనీసం ఆయన టీమ్ అయిన బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వాళ్లను ఓదార్చి పరామర్శిస్తే మానవత్వం పరిమళించేదని పేర్కొన్నారు. కాగా, చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారని,. కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారు” అని పవన్ పేర్కొన్నారు.
రేవంత్ డైనామిక్ లీడర్
ఇక రేవంత్ పేరు చెప్పకపోవడం వల్లే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారనే వాదనను పవన్ కల్యాణ్ ఖండించారు.. రేవంత్ రెడ్డి అస్థాయి నాయకుడు కారని, అతడో డైనమిక్ టీడర్ అంటూ ప్రశంసించారు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని,. కిందిస్థాయి నుంచి ఎదిగారని అన్నారు.. సంధ్య ఘటనలో బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అరెస్ట్ అయ్యేవారని ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నదని, ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు..
రేవంత్ పాలన గుడ్ ..
ఇక రేవంత్ తెలంగాణలో వైసిపి విధానాల విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదన్నారు. తెలంగాణ చిత్ర పరిశ్రమకు అవసరమైన మేర సాయం రేవంత్ సర్కార్ చేస్తున్నదని అన్నారు పవన్.. అందుకే ఎన్నడూ లేని విధంగా టిక్కెట్ ధరలు పెంపు, బెన్ ఫిట్ షోలకు అవకాశం రేవంత్ ఇచ్చారన్నారు . తెలంగాణలో రేవంత్ పాలన బాగనే ఉందటూ ఎపి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కితాబు ఇచ్చారు..