మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబును ఆయన నివాసంలో జనసేన అధినేత పవన్ కలిశారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
తరుచూ సమావేశమై పొత్తు ప్రక్రియను వేగవంతం చేయాలని గత భేటీలో నిర్ణయించిన ఇరువురు నేతలు ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.