ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బీజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి బొబ్బిలి వీణను బహూకరించారు. అనంతరం ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు.
అదేవిధంగా ఎర్రచందనం అక్రమ రవాణాపై కూడా చర్చ జరిగింది. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందన్నారు. అదానీ సోలార్ ప్రాజెక్టు అంశాన్ని సీఎం చంద్రబాబు మరోసారి పరిశీలిస్తున్నారని తెలిపారు. ఆ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సి అవసరం ఉందన్నారు.
- Advertisement -