Friday, November 22, 2024

AP: చంద్రబాబు అరెస్టును ఖండించిన పవన్ కళ్యాణ్

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇవాళ ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేయడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ… ప్రాథమిక ఆధారాలు చూపకుండా.. అర్థరాత్రి అరెస్టు చేశారన్న ఆయన.. 2022 అక్టోబర్‌లో వైజాగ్ లో తమ పట్ల కూడా అలాగే ప్రవర్తించారనీ, ఏ తప్పూ చెయ్యని తమ కార్యకర్తల్ని అరెస్టు చేశారని అన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చెయ్యాల్సింది పోలీసులైతే.. వైసీపీ వాళ్లు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని పవన్ ప్రశ్నించారు. వైసీపీ నేతలైతే.. విదేశాలకు కూడా వెళ్లవచ్చనీ, అదే టీడీపీ నేతను అరెస్టు చేస్తే, కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదా అని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబుకి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని పవన్ తెలిపారు. దీని నుంచి చంద్రబాబు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement