ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు చీలకుండా అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు. రాజధానిపై ఒప్పించినట్లే ఓట్ల చీలిక అంశంపైనా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓట్లు చీలనివ్వకూడదని నిర్ణయం తీసుకున్నానన్నారు. రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని జనసేనాని అన్నారు. ఎవరితో పొత్తులకు వెళ్లాలో వైసీపీ మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మంత్రి పదవులు మేం చెప్పిన వాళ్లకు జగన్ ఇస్తారా అని ప్రశ్నించారు. ఓట్లు చీలనివ్వబోమంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ఎక్కడ పోటీ చేసినా నన్ను ఓడిస్తామన్న వైసీపీ నేతల ఛాలెంజ్ స్వీకరిస్తున్నానన్నారు. ప్రజలకు దగ్గరయ్యే విధంగా నా యాత్ర ఉంటుందని పవన్ లెతిపారు. ఇప్పటికే అప్పు పుట్టని పరిస్థితిని రాష్ట్రానికి తీసుకొచ్చారన్నారు.
Breaking: పొత్తులపై మరింత క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్
Advertisement
తాజా వార్తలు
Advertisement