జి.రాగంపేటలో విషాదఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయిల్ ట్యాంకరులో దిగి ఏడుగురు కార్మికులు
ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు పవర్ స్టార్..జనసేన అధినేత పవన్ కల్యాణ్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.పరిశ్రమల్లో రక్షణ చర్యల గురించి సంబంధిత శాఖలు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నా, ఆ దిశగా చర్యలు లేవన్నారు. రెక్కల కష్టం మీద బతికే కార్మికులు మృత్యువాత పడుతున్నారని పవన్ వివరించారు. వారిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్ అగమ్యగోచరం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చెల్లించిన విధంగా పరిహారం ఇవ్వడంతో పాటు, తగిన ఉపాధి అవకాశాలు చూపించేలా ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో తరచుగా ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నా గానీ ప్రభుత్వం తగిన సమీక్షలు చేపట్టడంలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు.
కార్మికుల మృతికి విచారం వ్యక్తం చేసిన.. పవన్ కల్యాణ్
Advertisement
తాజా వార్తలు
Advertisement