Friday, November 22, 2024

పోసానికి కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్..

రిప‌బ్లిక్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన సంచ‌ల‌న కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో, అటు రాజ‌కీయ వ‌ర్గాల‌లోను సంచ‌ల‌నంగా మారాయి. ఆ స్పీచ్ తాలుకూ వేడి అంత తొందరగా తగ్గేట్లు లేదు. పవన్ స్పీచ్ కి వైసీపీ నేతలతో పాటు కొంద‌రు సినీ ప్ర‌ముఖులు కౌంట‌ర్స్ వేస్తున్నారు. తాజాగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన పోసాని.. ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నాయకులను ‘కుక్క’లతో పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు వపన్. వైసీపీ నేతలను గ్రామ సింహాలు అంటూ సంబోధించిన పనవ్ కళ్యాణ్.. కుక్కలుగా అభివర్ణించారు.

ఇక ప‌వ‌న్ త‌న సినిమా కోసం హీరోయిన్‌ని, పారితోషికం, క‌థ అన్నీ తానే స్వ‌యంగా సెల‌క్ట్ చేసుకుంటాడని పోసాని విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రెమ్యున‌రేష‌న్ కూడా ఆయ‌నే చెబుతాడు. ‘పవన్‌ నీ రెమ్యునరేషన్‌ 10 కోట్లా.. 50 కోట్లా. అత‌ను త‌న సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్‌ మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు. నేను ఒక్క సినిమాకు రూ. 15 కోట్ల చొప్పున ఇస్తాను 4 సినిమాలకు సంతకం చేస్తాడా? అంటూ పోసాని ఫైర్ అయ్యాడు.

తన సినిమాలకు రూ. 50 కోట్లు తీసుకోవట్లేదని పవన్‌ నిరూపిస్తే.. నన్ను చెంపదెబ్బ కొట్టండి’ అని పోసాని వ్యాఖ్యనించారు. మెగాస్టార్‌ చిరంజీవి సంస్కారవంతుడని, ఆయనను చూసి పవన్‌ నేర్చుకోవాలన్నారు. హీరోలు అంటే ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లని, వారు ఏనాడు డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో, డబ్బు విషయంలో వేలు పెట్టేవారు కాదన్నారు. వారు తెరమీదే కాదు నిజ జీవితంలోనూ రియల్‌ హీరోలని పేర్కొన్నారు.

పోసాని ప్రెస్ మీట్ అనంత‌రం ప‌వ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు .. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు స‌హజమే …అంటూ సంచ‌ల‌న ట్వీట్ చేశారు.

ఇక, ఏపీలో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రుద్దుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదని.. సంక్షేమం అసలే కాదన్నారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు. ‘నేటి నవరత్నాలు.. భావితరాలకు నవ కష్టాలు’ అని ఆయన ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం చేసిన వాగ్దానాలు.. వాటిని అమలు చేయడంలో కనిపిస్తున్న కటిక నిజాలు పేరిట #SaveAPfromYSRCP హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్‌ పోస్ట్‌ చేశారు. వైకాపా ఇచ్చిన హామీలు.. ప్రభుత్వం చేస్తున్న చర్యలను వివరిస్తూ పవన్‌ ట్వీట్‌ చేశారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: అందుకే రోహిత్‌ను కెప్టెన్ చేయాలి: లిటిల్ మాస్టర్

Advertisement

తాజా వార్తలు

Advertisement