Tuesday, November 26, 2024

అసని తుపాను: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న పవన్ కల్యాణ్

ఏపీలో అసని తుపాన్ ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితుల‌ను అన్ని విధాలా ఆదుకోవాల‌ని జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రైతాంగానికి ప్ర‌భుత్వం భ‌రోసా ఇవ్వాల‌ని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తుపాను ప్ర‌భావం కోస్తా జిల్లాలు.. ముఖ్యంగా ఉభ‌య‌ గోదావ‌రి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో క‌న‌ప‌డుతోంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. తుపాను ప్ర‌భావం వ‌ల్ల.. పండ్ల తోట‌లు, ఉద్యాన పంట‌లు వేసిన రైతులు కూడా దెబ్బ‌తిన్నార‌ని ఆయ‌న చెప్పారు. వరి కోత కోసే సమయంలో ఈ విపత్తు రావడం దురరృష్టకరమన్నారు. అనేక గ్రామాల్లో ధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులను భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాన్నారు.  తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలని పవన్ ప్రభుత్వాన్ని కోరారు.  తీరంలోని మ‌త్స్య‌కార గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆయ‌న అన్నారు. ఇళ్లు దెబ్బ తిన్న వారిని ఆదుకోవాల‌ని, వారికి జ‌న‌సేన శ్రేణేలు కూడా బాస‌ట‌గా నిల‌వాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.  పంట నష్ట పరిహారాన్ని తక్షణమే లెక్కించి వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలని కోరారు. తీరంలోనూ మత్స్యకార గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇళ్లు దెబ్బ తిన్నవారిని ఆదుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement