Thursday, November 21, 2024

AP : ఈనెల 14న తెనాలిలో పవన్​ ఎన్నికల ప్రచారం…

ఈనెల 14న తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్న‌ట్లు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించిన జగన్ మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికీ అవగాహన రాలేదన్నారు.

వాలంటరీ వ్యవస్థను ఎన్నికల డ్యూటీలో పెట్టవద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు. కాంట్రాక్టు బేస్ తో పనిచేసేవాళ్లను ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో వాడదని, గ్రామ వార్డు సచివాలయాల చట్టం తెచ్చినప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అనే పదం చట్టంలో వాడలేదన్నారు.

- Advertisement -

వాలంటీర్ల వ్యవస్థ పుట్టిన తర్వాత పెన్షన్లు పంపిణీ జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ వచ్చిన తర్వాత పెన్షన్ల వ్యవస్థ ప్రారంభమవ్వలేదని, రాబోయే కాలంలో మే ఒకటో తేదీన నూటికి నూరు శాతం , ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం పెన్షన్ల పంపిణీ జరిగి తీరుతుందన్నారు. అయితే.. తీవ్రమైన జ్వరంతో తెనాలిలో జరగాల్సిన ర్యాలీ, సభను రద్దు చేస్తున్నట్లు జనసేన గతంలో ప్రకటించింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జనసేన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా వాయిదా వేశారు. అయితే.. ఈ పర్యటనను ఖరారైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement