Saturday, November 23, 2024

AP అమిత్ షాతో ముగిసిన చంద్ర‌బాబు,ప‌వ‌న్ ల భేటి..

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ ముగిసింది. నేటి ఉద‌యం ఈ ఇద్ద‌రు నేత‌లు అమిత్ షాతో సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుపై ప్ర‌ధానంగా చ‌ర్చ కొన‌సాగింది. ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుపై టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరిన‌ట్లు టాక్ . అలాగే ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించింది.. ఈ నెల 14వ తేదిన జ‌రిగే ఎన్డీఎ స‌మావేశానికి చంద్ర‌బాబును హాజ‌రుకావాల్సిందిగా అమిత్ షో కోరారు.. కాగా బిజెపి, జ‌న‌సేన‌, బిజెపిలో పొత్తులో భాగంగా బిజెపి ఆరు లోక్ స‌భ , ఆరు ఆసెంబ్లీ స్థానాల‌కు పోటీ చేయ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు..ఇక జనసేన రెండు లోక్ సభ , 24 అసెంబ్లీ స్థానాలలో బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఈ మూడు పార్టీలు నేడు సంయ‌క్త ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేయ‌నున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement