Sunday, November 17, 2024

Wear Hand loom Cloths – చేనేత‌కు జీవం పోయండి – ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – చేనేతకు జీవం పోయాలని ఎపి ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపు ఇచ్చారు… చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు
ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటి అని.. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ అని అన్నారు. ఏపీలో ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ప్రతీకలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత వస్త్రాలు అనే మాట ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపాయన్నారు. అలాంటి చేనేత రంగానికి జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వం కచ్చితంగా చేనేత పరిశ్రమకు, ఈ రంగంపై ఆధారపడ్డ నేతన్నలకు భరోసా ఇస్తుందని హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రజలు సైతం ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని సంవత్సరాల కిందటే చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ క్రమంలోనే నేత వస్త్రాలను ధరిస్తున్నానని వెల్లడించారు. యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరిస్తే ఈ రంగంపై ఆధారపడ్డవారికి ధీమా కలుగుతుందని పవన్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement