Saturday, September 21, 2024

AP | పారిశ్రామికాభివృద్ధిలో పూర్వ వైభవం తీసుకురావాలి : సీఎం చంద్రబాబు

పారిశ్రామిక పాలసీ రూపకల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైసీపీ హయాంలో రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడిపోయిందని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. గత ప్రభుత్వ విధానాలను మార్చి ఏపీని పరిశ్రమలకు కేరాఫ్ గా మార్చడమే తన సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోని టాప్ 5 రాష్ట్రాలతో పోటీపడేలా నూతన పారిశ్రామికాభివృద్ధి విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

పాలసీని రూపొందించేటప్పుడు నీతి ఆయోగ్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని వృద్ధి రేటు కంటే 15 శాతం సాధించాలనే లక్ష్యంతో కొత్త విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనలో ఏపీకి మళ్లీ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 100 రోజుల్లో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన విధానాలను తీసుకురావాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement