Saturday, November 23, 2024

పర్యాటక కేంద్రంగా భగవతి దుర్గా గిరి

భగవతి దుర్గా గిరి ఆలయ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఆదివారం పోలాకి మండలం దీర్గాసి గ్రామంలో భగవతి దుర్గా గిరి ఆలయ ఏడవ వార్షికోత్సవంలో భాగంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉందని దీనిని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వివరాలు తెలియజేస్తూ నన్నయ కాలం నాటి రాతి శిలాశాసనం ఇక్కడ ఉందని ఇదే ప్రాంతంలో కొండ గుట్టల్లో దుర్గ అమ్మవారు కొలువుదీరి ఉన్నారని వివరించారు. ఈ ఆలయ నిర్మాణం 2015 సంవత్సరంలో స్థానికుల సహకారంతో చేపట్టామని తెలిపారు. ఈ విషయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని అందుకే దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని కృష్ణదాస్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement