ఐఎస్ఐ నిధులతో ఎస్డీపిఐ, పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా పార్టీలు పనిచేస్తున్నాయని తీవ్రమైన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ జీవిఎల్ నర్సింహరావు. ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందన్నారు.
కర్నూలు, ప్రభ న్యూస్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం మతతత్వ రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు అన్నారు. శనివారం కర్నూలు ఎస్ టి బి సి కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా నిరసన సభ నిర్వహించారు. కార్యక్రమంలో సోము వీర్రాజు ముఖ్య వక్తగా ప్రసంగించారు. ఆత్మకూరులో హిందువులు నివాసం ఉన్న ప్రాంతాల్లో మసీదు కట్టాలని ఎమ్మెల్యే ప్రోద్బలంతో అక్కడి ముస్లింలు ఉన్నారని ఆరోపించారు. మసీదు కట్టడాన్ని అడ్డుకున్న బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసి, రౌడీ షీట్ ఓపెన్ చేయడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. అరాచకం ఒకరు చేస్తే మరొకరిని వేధిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ కు సిగ్గు ఉందా అని సోము ప్రశ్నించారు. మసీదు నిర్మాణం ఆపాలని కోరేందుకు వెళ్లిన బేజీపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని రక్షణ పొందుతుంటే ఏకంగా ఆత్మకూరు పోలీసు స్టేషన్ లో చంపాలని చూశారని మండిపడ్డారు.
ముస్లింలను నామ మాత్రంగా అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపి, బీజేపీ కార్యకర్తలను మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులలో ఐపీఎస్ అధికారులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారని ఆరోపించారు. హిందువులను అవమానపరిచిన వారిని పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఐఎస్ఐ నిధులతో ఎస్డీపిఐ, పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా పార్టీలు పనిచేస్తున్నాయని తీవ్రమైన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ జీవిఎల్ నర్సింహరావు. ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం స్పందించక పోతే తామే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందన్నారు. దేవాలయ భూమలను రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలని చూస్తోందని.. ఎట్టి పరిస్థితుల్లో వీటిని అడ్డుకొని తీరుతామన్నారు జీవీఎల్.