Sunday, November 24, 2024

Solar Eclipse: దేశంలో పాక్షిక సూర్యగ్రహణం.. 2007 తర్వాత మళ్లీ ఇప్పుడే అంటున్న శాస్త్రవేత్తలు

దేశంలోని అనేక ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తోంది. చంద్రుడు సూర్యుడిని కమ్మేయడం ప్రారంభమైన తర్వాత మొదటిసారి ఢిల్లీలో సాయంత్రం 4:29 గంటలకు గ్రహణం కనిపించింది. ఇక్కడ చంద్రుడు సూర్యుడిని 43 శాతం కమ్మేయడం చూడొచ్చు. ఇక.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో పాక్షిక సూర్యగ్రహణాన్ని చూశారు. శ్రీనగర్‌లో సూర్యగ్రహణం గరిష్టంగా 55 శాతం కనిపించిందని పీటీఐ న్యూస్​ ఏజెన్సీ తెలిపింది.

అమావాస్య రోజున చంద్రుడు భూమికి, సూర్యునికి మధ్య వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రుడు, సూర్యుడిని పాక్షికంగా కవర్ చేసినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది. అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా, సూర్యుడు, చంద్రుడు, భూమి సరిగ్గా ఒకే అక్షాంశంలోకి వచ్చినప్పుడు ఇట్లా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుని ఉపరితలంపై ఒక చిన్న భాగంలో చీకటి నీడ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక.. పాక్షిక సూర్యగ్రహణంలో మూడు దశలు ఉంటాయి.. వీటిలో ప్రారంభం, గరిష్ట స్థాయికి చేరుకోవడం, ముగింపు వంటి అంశాలుంటాయని తెలుస్తోంది.

ఇక.. పాక్షిక సూర్యగ్రహణం 2007 తర్వాత మొదటిసారిగా భారతదేశంలో కనిపించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 2032 వరకు భారతదేశంలో పాక్షిక సూర్యగ్రహణం కనిపించలేదు. అల్యూమినైజ్డ్ మైలార్, బ్లాక్ పాలిమర్, షేడ్ నంబర్ 14 యొక్క వెల్డింగ్ గ్లాస్ వంటి సరైన ఫిల్టర్‌ని ఉపయోగించడం లేదా టెలిస్కోప్ ద్వారా కానీ, తెల్లటి బోర్డుపై సూర్యుని ఇమేజ్‌ని ప్రొజెక్షన్ చేయడం ద్వారా కానీ సూర్యగ్రహణాన్ని చూడడం సురక్షితమని డాక్టర్లు చెబుతున్నారు. లేకపోతే రెటీనా దెబ్బతిని కంటిచూపు మందగించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​లో మూతపడ్డ ఆలయాలు..
సూర్యగ్రహణం సందర్భంగా ఆలయానికి తలుపులు వేస్తున్న పూజారులు
Advertisement

తాజా వార్తలు

Advertisement