అనంతపురం . టీడీపీ బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల సునీతను అరెస్ట్ చేసి, రామగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం 4 గంటలకే సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె పోలీసు నిర్బంధాన్ని దాటుకుని బయటకు వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.
తన తల్లిని అరెస్ట్ చేయడంతో పరిటాల శ్రీరామ్ ఆందోళనకు దిగారు. నల్ల చొక్కా వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఇక ఉదయం పరిటాల శ్రీరామ్ ను హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు రావడంతో పోలీసుల కళ్లు కప్పి గోడ దూకి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నాడు పరిటాల.. ఇదే సమయంలో గాంధీనగర్ సర్కిల్ కు భారీగా చేరుకున్నారు టిడిపి నాయకులు..ఇక రోడ్డుపై బైఠాయించిన పరిటాల శ్రీరామ్ ను అడ్డుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.