Saturday, November 9, 2024

Papikondalu Tour – గోదావ‌రిలో లాహిరి .. లాహిరి …

తొలి ప్ర‌యాణానికి పోటెత్తిన టూరిస్ట్స్
ఎపి టూరిజం శాఖ అధ్వ‌ర్యంలో నిర్వ‌హ‌ణ‌
మొత్తం అందుబాటులో 15 బోట్లు
ఆన్ లైన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్

హైద‌రాబాద్ – నాలుగు నెల‌ల విరామం అనంత‌రం మ‌ళ్లీ పాపికొండ‌ల విహారయాత్ర ప్రారంభ‌మైంది.. దేవీపట్నం మండలం గండి పోశమ్మ ఆలయం వద్ద ఉన్నర బోటింగ్ పాయింట్ నుంచి ఇవాళ ఒక టూరిస్ట్ బోట్ పర్యాటకులను తీసుకుని పాపికొండల పర్యటనకు బయల్దేరింది. గోదావరి వరదలు కారణంగా జులైలో నిలిపివేసిన పాపికొండలు విహారయాత్ర మళ్లీ ప్రారంభం కావ‌డంతో తొలి రోజే టూరిస్ట్ లు పోటెత్తారు. దీంతో . ఏపీ టూరిజం శాఖకు చెందిన ఒక బోటుతో పాటు ప్రైవేట్ ఆపరేటర్లకు సంబంధించిన మరో 14 బోట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది ఎపి ప‌ర్యాట‌క శాఖ

పాపికొండ‌ల పాయ‌ల‌లో విహారం..

పాపికొండలు విహారయాత్ర టూరిస్టులను ఎంతగానో కట్టిపడేస్తుంది.. ఈ ప్రదేశాన్ని శ్రీరాముడు మరియు సీతాదేవి వనవాస సమయంలో సందర్శించారని నమ్ముతారు. కొండలు, లోయ మరియు జలపాతాల వీక్షణను ఆస్వాదించడమే కాకుండా, పర్యాటకులు క్యాంపింగ్ , ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలతో ఈ టూరు ఎంతో అనుభూతిని కలిగిస్తుంది..

అందుబాటులోనే టికెట్ ధ‌ర

- Advertisement -

ఇక ప్రకృతి సోయగాలు కనువిందు చేసే పాపికొండలు వద్దకు తీసుకు వెళ్లేందుకు రాజమండ్రి నుంచి పెద్దలకు 1250 రూపాయలు… పదేళ్లలోపు చిన్నారులకు వెయ్యి రూపాయలు టికెట్ గా ఖరారు చేశారు. రాజమండ్రిలోని పర్యాటకశాఖ కార్యాలయం నుంచి ఉదయం 7:30 కు వాహనంలో గండి పోశమ్మ ఆలయం వద్దకు తీసుకెళ్తారు. ఉదయం 9 గంటలకు గోదావరిలో పర్యాటకుల బోటు ప్రారంభమై సాయంత్రం ఐదున్నరకు తిరిగి చేరుకుంటుంది. సుమారు 75 కిలోమీటర్ల మేర గోదావరిలో ప్రయాణం సాగనుంది. అలాగే బోట్ల‌లో లైఫ్ బోట్ల‌తో పాటు సుశిక్షితులైన ఈత గాళ్ల‌ను నియ‌మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement