మీరెప్పుడయినా బంగారు బల్లిని చూశారా..అంతరించిపోతున్న జీవ జాతుల్లో అరుదైన జాతికి చెందినదే ఈ బంగారు బల్లి. ఈ బల్లులు బంగారు రంగులో మెరుస్తుంటాయి. 15 సెంటీమీటర్ల నుంచి 18 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. సూర్యరశ్మి సోకని, చల్లని ప్రదేశాల్లో ఉంటాయి. రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి. రాతి గుహలు, గుహల సందుల మధ్య ఉండే తేమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడివి పోలవరం అడవిగా పిలిచే పాపికొండలు అభయారణ్యంలో ఉన్న గుహల్లో కనిపిస్తున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సుమారు 250 వరకు బంగారు బల్లులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఈ బల్లులు ఒకే సారి 40 నుంచి 150 వరకు గుడ్లను పెడతాయి. అయితే ఆ గుడ్లను పాములు, ఇతర క్రిమికీటకాలు తినేస్తుండటంతో ఇవి అంతరించిపోయే జాబితాలో చేరాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement