నందికొట్కూరు, (ప్రభ న్యూస్): శ్రీశైలం మల్లన్న సన్నిధికి వెళ్లే భక్తులకు ఆపద్భాందవుడిలా మారారు పాండురంగడు. కర్నాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుండి శివరాత్రి సందర్భంగా తరలి వచ్చే వేలాది మంతి భక్తులకు అన్నదానం చేస్తూ వారి ఆకలి బాధ తీరుస్తున్నారు. నందికొట్కూరుకు చెందిన అల్లూరి జిలానీల పాండురంగడు 12 సంవత్సరాల క్రితం శ్రీశైలానికి పాదయాత్రతో వెళ్తున్న భక్తులను చూసి చలించిపోయారు. వారితో మాట్లాడి వారి, ఆకలి దప్పుల గురించి తెలుసుకున్నారు. వారి వేదన విన్న తర్వాత అట్లాంటి భక్తులకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన వద్ద అంత శక్తి లేకున్నా దాతలు సాయంతో కార్యక్రమం ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రి టైమ్‌లో భక్తులకు అన్నదానం చేస్తున్నాడు. ఆయన సేవలను చాలామంది కొనియాడుతున్నారు.
ఆకలి తీర్చే ఆపద్భాందవుడు పాండురంగడు.. 12 ఏళ్లుగా భక్తులకు అన్నదానం
Advertisement
తాజా వార్తలు
Advertisement