Wednesday, November 20, 2024

Palnadu Tour – నేడు సరస్వతి పవర్ భూములను పరిశీలించనున్న పవన్

అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ జిల్లాలో మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ భూములను పవన్ పరిశీలించనున్నారు..

జిల్లాలోని మాచవరం మండలంలో సరస్వతి పవర్‌కు 1515.93 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో అటవీ భూములు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ భూములను సర్వే చేయాలని డీప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

- Advertisement -

పవన్ కల్యాణ్ ఆదేశాలతో అటవీ, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు.సర్వే నివేదికను పవన్ కల్యాణ్ కు అందించారు. నివేదికను పరిశీలించిన ఆయన మంగళవారం ఉదయం సరస్వతి పవర్ భూములను పరిశీలిస్తారు.ఈ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement