. ప్రజల అందరి కల సాకారమవుతున్న వేళ. . పలాస , డిసెంబర్ 14: పలాస ప్రాంత ప్రజలకు దేవుడు పంపించిన మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి అప్పలరాజు అన్నారు అటువంటి వ్యక్తికి మనం జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేవుడు స్వరూపమని కొనియాడారు. ఒక వైద్యునిగా ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి కారణంగా ఎంతో మందిని తాను చూశారని ఈ వ్యాధి ఎందుకు వస్తుందో అని ప్రజలు తెలియక తమ ఇంటిలో కుటుంబ సభ్యులు చనిపోతున్న వేళ వారు ఎంతగా రోధిస్తున్నారో తెలియజేస్తూ ఇప్పుడు ఆ పరిస్థితి నుండి ఉద్దానం ప్రాంత ప్రజలను బయటపడవేసేందుకు ఈ సుజలధార పథకం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కు ముఖ్యమంత్రి కంకణం కట్టుకొని వాటిని పూర్తి చేసి ప్రారంభించారని అన్నారు. దానితోపాటు ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ పార్క్ కు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు.
పారిశ్రామికంగా శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఒకపక్క మూలపేట పోర్టు నిర్మాణం, మరోపక్క మరికొన్ని పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపడుతుండటంతో దీనివల్ల శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ఈ ప్రాంతానికి వలసలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అటువంటి అభివృద్ధిని చేసి పెడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరికి టిక్కెట్ ఇచ్చిన వారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని అప్పలరాజు అన్నారు.పలాస మున్సిపాలిటీ అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయాలని ముఖ్యమంత్రిని అప్పలరాజు ఈ సందర్భంగా కోరారు. పలాస మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి 60 కోట్ల రూపాయలు కు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని, ఆ మేరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అదేవిధంగా మదన సాగర చెరువు అభివృద్ధికి ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయాలని, బెండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధులు మంజూరు చేయాలని కోరారు