Thursday, November 21, 2024

పాకిస్తాన్ జైల్ లో శివుడిని ప్రార్థించా: ప్రశాంత్

పాకిస్థాన్‌లోకి అక్రమంగా చొరబడి అక్కడి జైలులో మగ్గి విడుదలైన ప్రశాంత్ విశాఖపట్నం చేరుకున్నాడు. ఈ సందర్భంగా  పాక్ జైల్లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో నన్ను ఎవరూ పట్టుకోలేదని తెలిపారు. ‘‘నేను మళ్ళీ మా అమ్మ, నాన్నలను కలుస్తానని అస్సలు అనుకోలేదు. భారత ప్రభుత్వం సహాయం చేయబట్టే నేను ఇంత వేగంగా ఇంటికి చేరుకోగలిగాను. నాలాగే వెళ్లి పాకిస్తాన్‌లో ఇరుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ చిక్కుక్కున్న భారతీయుల పేర్లను నేను ప్రభుత్వానికి ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌లో నాలాగా చిక్కుక్కున్న మిగతా వారిని కూడా భారత్‌కి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నా. కొంతమంది శిక్ష పూర్తయినా ఇంకా ఎంబసీలోనే క్లియరెన్సీ కోసం వేచి చూస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో నన్ను ఎవరూ పట్టుకోలేదు.

పాకిస్తాన్ బోర్డర్ దాటి నడుచుకుంటూ వెళ్తుంటే హైవే ప్యాట్రోల్ వాహనం వాళ్ళు రెండోవ రోజు నన్ను పట్టుకున్నారు. పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన తరవాత నేను ఎడారిలో 40 కిలో మీటర్లు నడిచాను. పాకిస్థాన్ భద్రత సిబ్బంది మానవత్వం చూపారు. పాకిస్థాన్ జైల్లో ఏ భారత ఖైదీలతో పని చేయించరు. పాకిస్థాన్‌లో ఉన్న ఖైదీలను ముస్లింలుగా మారమని అడుగుతారు. నేను మారనని శివుణ్ణి ప్రార్థిస్తానని చెప్పాను. దేశం కోసం, పాకిస్థాన్ కోసం ప్రార్థనలు చేశాను. నేను భావల్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నాను. నాతో పాటు జైల్ సెల్‌లో ఇంకొకరు ఉండే వారు. మళ్లీ నేను ఓ మంచి సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడతా. దానికోసం జైల్లోనే కొన్ని పుస్తకాలు చదివాను’’ అని ప్రశాంత్ వివరించాడు.

తన కుమారుడు క్షేమంగా ఇంటికి రావడానికి భారత ప్రభుత్వం చాలా సహాయం చేసిందని ప్రశాంత్ తండ్రి బాబూరావు తెలిపారు. కొడుకు వస్తాడో రాడో అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే ఈ రోజు మా అబ్బాయిని చూడగలిగామన్నారు.  తెలంగాణ, ఏపీ ప్రభుత్వలతో పాటు సహయత అనే స్వచ్ఛంద సంస్థ ఎంతో సహయం అందించిందన్నారు.

విశాఖ మధురవాడ మిథిలాపురి వుడా కాలనీకి చెందిన యువకుడు ప్రశాంత్ పాకిస్థాన్ చారాల నుండి విడుదల అయ్యాడు.. ప్రశాంత్ ని పాక్‌ అధికారులు వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించారు. దీంతో ప్రశాంత్‌ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకోనున్నాడు. నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్న ప్రశాంత్‌.. 2017లో తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో పాక్‌ అధికారులకు చిక్కాడు. ఎలాంటి వీసా,పాస్‌ పోర్ట్‌ లేకుండా పాక్‌ భూభాగంలో అడుగుపెట్టడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్‌ పాక్‌ అధికారులకు చిక్కడంతో అతడి తండ్రి బాబూరావు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిశారు. తన కుమారుడిని విడిపించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ సహకారంతో ప్రశాంత్‌ను తిరిగి స్వదేశానికి రప్పించారు. ప్రశాంత్‌ విడుదలతో అతడి కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement