స్వయంకృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన తెలుగు తేజాలైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024కు గాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు వ్యక్తులకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించగా అందులో ఇద్దరు తెలుగువారే కావడం గమనార్హం. ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. ఈసందర్భంగా వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అభినందనలు తెలిపిన సీఎం జగన్…
పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరిద్దరినీ ప్రశంసించారు.
శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి…
పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పద్మవిభూషణ్ అవార్డు కు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన వారి ప్రస్థానం రేపటి విశ్వంభరదాక విజయవంతంగా సాగుతుందన్నారు. రక్తదానం, నేత్రదానం ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
“పద్మ విభూషణ్ అందుకోబోతున్న వెంకయ్యనాయుడు గారికి, చిరంజీవి గారికి అభినందనలు. ప్రజా వ్యవహారాల్లో వెంకయ్యనాయుడు తనదైన ముద్ర వేశారు. చిరంజీవి గారు కళా రంగానికి విశిష్ట సేవలందించారు. వీరిద్దరూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పద్మ విభూషణ్ వంటి గొప్ప అవార్డుకు వీరిద్దరూ అర్హులే. తెలుగు ప్రజలు గర్వించే క్షణాలివి” అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.
అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్..
స్వయంకృషితో భారత చలన చిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న చిరంజీవిని పద్మవిభూషణ్ వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నటనారంగంలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, సినిమాను మనసుపెట్టి చేశారని గుర్తుచేశారు. అలాగే పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కూడా పవన్ అభినందనలు తెలిపారు.
“ప్రతిష్ఠాత్మక ‘పద్మ విభూషణ్’ అవార్డు అందుకోబోతున్న చిరంజీవి గారికి కంగ్రాచ్యులేషన్స్. ఈ పురస్కారానికి మీరు అన్ని విధాలా అర్హులు. భారతీయ సినిమాకు, సమాజానికి విస్తృత స్థాయిలో మీరు అందించిన సేవలు… నన్ను తీర్చిదిద్దడంలోనూ, అశేష అభిమానులకు స్ఫూర్తిగా నిలవడంలోనూ కీలకపాత్ర పోషించాయి. ఈ గొప్ప దేశంలో మీరొక నిష్కళంక పౌరుడు. చిరంజీవి గారికి ఇంతటి విశిష్ట గుర్తింపును, గౌరవాన్ని ఇచ్చినందుకు భారత కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎంతో మద్దతుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం” అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కేటీఆర్…
పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
.. ‘ప్రతిష్ఠాత్మకమైన పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు, తెలుగు ప్రజలకు ఇదొక గొప్ప గౌరవం. ఈ అచీవ్ మెంట్ ను ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మమ్మల్నందరినీ ఎంతో గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ అల్లు అర్జున్ చేశారు.
శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్…
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వెంకయ్యనాయుడు, చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. వారి విజయాలు రాబోయే తరాల్లో స్ఫూర్తిని రగిలించాలని ఆకాంక్షించారు.
‘బాల రాముడి దర్శనం అయ్యాక మీకు పద్మ విభూషణ్ దక్కడం చాలా సంతోషంగా ఉంది. మీ విషయంలో ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటా బాబాయ్. కంగ్రాట్స్’’ – దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు
‘‘నా ప్రియ మిత్రుడు చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. ఈ పురస్కారానికి మిమ్మల్ని మించిన అర్హుడు ఎవరు లేరని నా అభిప్రాయం. చాలా గర్వంగా ఉంది మిత్రమా’’ – వెంకటేష్
‘‘పద్మ విభూషణ్ పురస్కారంతో నా మిత్రుడు చిరంజీవి గౌరవించబడటం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు మిత్రుడిని అయినందుకు గర్వంగా ఉంది. కంగ్రాట్ మై డియర్ చిరంజీవి’’. – అక్కినేని నాగార్జున
‘‘మా లెజండరీ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడంతో ఎంతో గౌరవంగా ఉంది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు ఇది’’ – మహేష్‌బాబు
‘‘పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి కంగ్రాట్స్ అన్నయ్య. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’’ – రవితేజ
‘‘డ్రీమ్ బిగ్’ అంటూ ఎన్నో తరాల్లో ప్రేరణ నింపారాయన. మంచి మనసు, గొప్ప లెగసీ కలిగిన చిరంజీవిని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించడం ఎంతో సంతోషంగా ఉంది’’ – నాగవంశీ
‘‘పద్మవిభూషణ్ అవార్డుకు చిరంజీవిగారిని ఎంపిక చేశారనే అద్భుతమైన వార్తతో నిద్ర లేచా. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే క్షణాలు ఇవి. కంగ్రాట్స్ మెగాస్టార్ చిరంజీవిగారు’’ – మంచు విష్ణు
‘‘నాకు బాగా నచ్చిన ఫొటో ఇదే. ఎల్లప్పుడూ నాపట్ల దయ, ఆప్యాయంగా ఉన్నందుకు.. మనసును హత్తుకునే ప్రదర్శనలతో అద్బు?తమైన చిత్రాలను అందించినందుకు.. మా ‘మెగాస్ట్టార్’గా నిలిచినందుకు ధన్యవాదా?ని. ఇకపై మీరు పద్మవిభూషణ్ చిరంజీవి’’ – అడివి శేష్