Friday, November 22, 2024

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు… కొట్టుకుపోయిన పచర్ల వంతెన

సదుం మండలంలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.. దీంతో మండలంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంకలు వాగులు పొంగి పొర్లుతుండడంతో మండలంలోని కలికిరి, కంభంవారిపల్లె మార్గంలోని పచ్చర్ల వంతెన ఇవాళ ఉద‌యం కురిసిన భారీ వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే సదుం, పుంగనూరు మార్గంలోని తాత్కాలిక రోడ్డు కూడా దెబ్బతినడంతో పంచాయతీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇదే విధంగానే తాటిగుంట పాళ్యం మార్గంలో రోడ్డుపైన భారీగా వర్షపు నీరురావడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. గత నెల క్రితం పడిన వర్షానికి బాలం వారి పల్లి వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో ప్రజలు 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి పీలేరుకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే కాకుండా మండలం తిమ్మానాయనపల్లె పంచాయతీలో వ్యాసప్పచెరువు కూడా ప్రమాద స్థాయికి చేరుకున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ మురళి రెడ్డి పేర్కొన్నారు .ఇరిగేషన్ అధికారులు, పాలకులు సంబంధిత అధికారులు సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement