రాష్ట్రంలోని 175 సీట్లకు 175 సీట్లు గెలుపే మన టార్గెట్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభలో జగన్ మాట్లాడుతూ… ఈ యుద్ధంలో గెలుపు మనదేనన్నారు.
భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సంద్రం కనిపిస్తోందన్నారు. మనం చేసే మంచి పనులే మనల్ని గెలిపిస్తాయన్నారు. ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడన్నారు. ఈ అర్జునుడికి తోడు దేవుడితో పాటు ప్రజలు ఉన్నారన్నారు. అటువైపు వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తులు అన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. చంద్రబాబు తో సహా అందరినీ ఓడించాలన్నారు. ఇటు పాండవులు ఉంటే.. అటు కౌరవులు ఉన్నారన్నారు. ఈ యుద్ధంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక పొత్తుల కోసం దత్త పుత్రుడితో పాటు ఇతరుల కోసం వెంపర్లాడుతున్నారన్నారు.
మేనిఫెస్టోను బైబిలు, భగవద్గీతగా భావిస్తున్నామన్నారు. గత పాలకులు మేనిఫెస్టోను చెత్తబుట్టల్లో పడేశారన్నారు. 99శాతం హామీలను అమలు చేసిన పార్టీ వైసీపీనేనన్నారు. కొత్త హామీలతో గారడీ చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. 175 స్థానాల్లో పోటీకి వాళ్లకు అభ్యర్థులు కూడా లేరన్నారు. 2019లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావని జగన్ అన్నారు. 56 నెలల పాలనలో అన్ని రంగాలను అభివృద్ధి చేశామన్నారు.