కృష్ణా జిల్లా గంగూరులోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు, ధాన్యం సేకరణను సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు.
అన్నదాతలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు ఏం చేయాలనే అంశంపై సీఎం రైతులతో మాట్లాడి… వారి సూచనలు తీసుకున్నారు. ఇక గతేడాది కంటే ఈ ఏడాది పంటలు అధికంగా పండాయని, మిషన్ హార్వెస్టింగ్‌తో ఎకరాకు ఐదు, ఆరు వేలు కలిసి వచ్చిందని రైతులు చెప్పారు.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘‘అన్నదాతకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. సాంకేతికతను చేరువ చేసి రైతులకు సాగు ఖర్చులు తగ్గిస్తాం. ఆధునిక వ్యవసాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్నదాతను అగ్రస్థానంలో నిలుపుతాం. ఈ సీజన్ లో ధాన్యం సేకరణ విధానాలు మార్చి, నిబంధనలు సరళతరం చేసి ఖరీఫ్ లో ఇప్పటివరకు 19 లక్షల 90 వేల 945 మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ జరిపాం. 3 లక్షల మంది రైతులకు రూ. 4,584 కోట్ల ధాన్యం కొనుగోలు డబ్బును 48 గంటల్లో చెల్లించాం అని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను.”అని అన్నారు.