Friday, October 18, 2024

Paderu | అత్యంత పారదర్శకంగా లాటరి నిర్వహణ : కలెక్టర్ దినేష్ కుమార్

పాడేరు, : జిల్లాలో 40 మద్యం షాపుల నిర్వహణకు సోమవారం జరిగిన లాటరి ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. పాడేరులో పది, అరుకులో ఆరు, చింతపల్లిలో ఆరు, రంపచోదవారంలో పది, చింతూరులో ఎనిమిది మొత్తం 40 మద్యం షాపులకు గాను 1205 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

అయితే ఈ రోజు స్థానిక విఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన లాటరిలో గెలుపొందిన వారికి షాపులు కేటాయించడం జరిగిందని, కాగా గెలుపొందిన వారు సకాలంలో డబ్బులు చెల్లించకపోతే తదుపరి గెలుపొందిన వారికి షాపు కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో అన్ రిజర్వ్డ్ కేటగిరీ లెకపొయినప్పటకీ పాడేరుకు సంబంధించి ఒక షాపుకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న ఒక గిరిజనేతరునికి లాటరిలో రావడంతో తదుపరి వ్యక్తికి షాపు కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ లాటరీలో సంయుక్త కలెక్టర్ డా.ఎంజే అభిషేక్ గౌడ్, ఎక్శైజ్ సహాయ కమిషనర్ వి. మహేశ్వర్, రంపచోడవరం సహాయ ఎక్శైజ్ పర్యవేక్షకులు నాగ రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement