Sunday, November 3, 2024

AP: వరద నీటిలో చిక్కుకున్న ఒరిస్సా బస్సు

చింతూరు, ప్రభన్యూస్ : ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవెట్ ట్రావెల్స్ గుప్తా బస్సు వరద నీటిలో చిక్కుకుంది. సోమవారం ఉదయం ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంధ్రాకు వస్తుంది. ఈ క్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లారంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కల్లేరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుయుగూరు – నిమ్మలగూడెం గ్రామాల జాతీయ రహదారిపై అప్పటికే కుయుగూరు వాగు వరద నీరు రహదారిపై చేరి ఉంది. తెల్లవారు జామున 4.30 గంటలు కావడంతో వరద నీరు సరిగా కనిపించకపోవడంతో బస్సు వెళ్లి పోతుందిలే అనే ఉద్దేశ్యంతో డ్రైవర్ వరద నీటిలో నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు.

ఈ తరుణంలో రహదారి పక్కకు వెళ్లి బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఇది గమనించిన డ్రైవర్ బస్సును ఆపి బస్సులో ఉన్న సుమారు 45 మంది ప్రయాణికులను దించేసాడు. ప్రయాణికులు అక్కడి నుండి మోకాళ్ళ లోతు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లిపోయారు. ప్రయాణికులు దిగి నడిచి వెల్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతూరు రెవిన్యూ, పోలీసులు, పంచాయతీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో వరద నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు తీశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement