Tuesday, November 5, 2024

AP: ప‌ల్నాడు డీపీవోపై వేటు… విచార‌ణ‌కు ఆదేశం

వెబ్ కాస్టింగ్ ప‌ర్య‌వేక్ష‌ణాధికారిగా విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి
పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేసినా….
అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌ని డీపీవో
విధుల నంచి తొల‌గించి విచార‌ణ‌కు ఆదేశించిన ఎన్నిక‌ల సంఘం

పల్నాడు డీపీవో విజయభాస్కర్ రెడ్డిపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి వెబ్ కాస్టింగ్, పర్యవేక్షణ అధికారిగా ఉన్న డీపీఓ విజయభాస్కర్ రెడ్డి.. పాలువాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంని ధ్వంసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాడు.. దీంతో డీపీఓ విజయభాస్కర్ రెడ్డిపై టీడీపీ నాయకులు ఎన్నికల సంఘంకి ఫిర్యాదు చేయ‌డంతో రంగంలోకి దిగిన ఈసీ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.


అర్ధరాత్రి ఎస్పీ కార్యాల‌యంలో పిన్నెల్లి…
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై నమోదైన ఈవీఎం ధ్వంసం కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, ఈ బెయిల్ కు కొన్ని షరతులను కూడా విధించింది. ఇందులో ప్రతిరోజూ ఎస్పీ కార్యాలయానికి హాజరై సంతకం చేయాలనే కండీషన్ పెట్టింది.. ఈ నేపథ్యంలో పిన్నెల్లి దాదాపు రెండు వారాల తర్వాత పల్నాడులోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆయన అర్ధరాత్రి 12 గంటలకు ఎస్పీ మలికా గార్గ్ ముందు సంతకం పెట్టి వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement