Monday, November 25, 2024

AP | పోలీసు నియామకాల్లో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం.. ఏపీ డీజీపీ నిర్ణయం

అమరావతి, ఆంధ్రప్రభ: పోలీసు నియామకాల్లో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించేందుకు కృషిచేస్తామని లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీజీపీ శంకబ్రత భాగ్చీ అన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్‌ జెండర్‌ ప్రొటెక్షన్‌ కోసం సీఐడి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. సీఐడి ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌, ఏపీ ట్రాన్సజెండర్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ సంయుక్త ఆధ్వర్యాన బుధవారం ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆవరణలో ప్రొటెక్షన్‌ అఫ్‌ ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ భౌతిక, సంక్షేమ, పాలనా, చట్టపరమైన అంశాలపై శిక్షణ, అవగాహన సదస్సు జరిగింది.

సీఐడి అదనపు డీజీ సంజయ్‌, ఆయన సతీమణి మహిత సంజయ్‌ జ్యోతి ప్రజ్వళన చేసి సదస్సు ప్రారంభించగా శిక్షణ తరగతుల్లో భాగంగా భారతదేశంలోని ట్రాన్సజెండర్‌ పర్సన్స్‌ సమస్యలకు సంబంధించి వారి హక్కులపై అవగాహన కల్పించారు. ముగింపు సందర్భంగా బాగ్చీ మాట్లాడుతూ రాష్ట్రంలో ట్రాన్స్‌జండర్స్‌ సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు చట్టపరమైన హక్కులు, వారి రక్షణకు సంబంధించి పోలీసుశాఖ శ్రద్ధతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రారంభ సభలో సీఐడి చీఫ్‌ సంజయ్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశ్యం ట్రాన్సజెండర్స్‌ పర్సన్స్‌ తమ హక్కుల కోసం, స్వయం ఉపాధి కల్పించడానికి, తమను తాము రక్షించుకోవడానికి సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టు-కుందని వివరించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసు అధికారులు ట్రాన్సజెండర్‌ పర్సన్స్‌ సమస్యలు, వారి చట్టాల పట్ల అవగాహనా కలిగి ఉండాలని సూచించారు. దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో తొలి కేసు నమోదైనట్లు తెలిపారు. అదేవిధంగా వారిపై జరుగుతున్న రిపోర్ట్‌ కానటవుంటి నేరాలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. వారికి ఉపాధి కల్పన దిశగా చర్యలు తీ సుకోవాలని., దీనిలో పోలీసులు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. ట్రాన్స్‌జెండర్స్‌కు వైద్య సేవలకు సంబంధించి ఉచితంగా అందిస్తామని మెడికల్‌ కౌన్సిలర్‌ మండవరావు తెలిపారు.

- Advertisement -

సీఐడి మహిళా ప్రోటెక్షన్‌ సెల్‌ ఎస్పీ సరిత మాట్లాడుతూ రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ ప్రొ-టె-క్షన్‌ సెల్‌ను గత ఏడాది నవంబర్‌ 22వ తేదీన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా స్వాభిమాన్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ -1091ను లింగ మార్పిడి వ్యక్తుల కోసం ఏర్పాటు- చేసినట్లు- తెలిపారు. దానిద్వారా అత్యవసర సహాయం అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా స్వాభిమాన్‌ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ యల్‌. రామకృష్ణ, డాక్టర్‌ విజయరామన్‌, హైకోర్టు స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ సెక్రటరీ ఎం బబిత- తదితరులు హాజరుకాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి మహిళా పోలీసు స్టేషన్‌ డిఎస్పీలు, సీఐలు, మహిళా పోలీసులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement