భూమి కోసం..జీవించే హక్కుకోసం..భుక్తికోసం గతంలో ఉత్తరాంధ్ర ప్రజలు ఎలుగెత్తారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చరిత్ర ఉందని, గతంలో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ ఇక్కడి పేదరికాన్ని గుర్తించారని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసలో విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో తమ్మినేని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విశాఖ రాజధాని ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవకాశం వచ్చిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని అన్నారు. అనవసర పట్టింపులకు పోకుండా ఉత్తరాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వకపోతే నష్టపోయేది మనమేనని అన్నారు. ఒక్క రాజధాని వద్దని మూడు రాజధానులే ముద్దు అని వ్యాఖ్యానించారు. అమరావతి కోసం 30 వేల ఎకరాలు తీసుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని తమ్మినేని ఈ సందర్భంగా ఆరోపణలు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement