ఒంటిమిట్ట (కడప) ప్రభ న్యూస్: కడప జిల్లా, ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈనెల 15వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తరపున అదేరోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. రాములవారి కల్యాణానికి దాదాపు రెండు లక్షల మంది హాజరు కావచ్చునని అంచనా వేశామని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒంటిమిట్టలో టీటీడీ నిర్మించిన ఆలయ కార్యాలయాల సముదాయం, అతిథి గృహం, యాత్రికుల వసతి సముదాయాలను జిల్లా పరిషత్ చైర్మన్ అమరనాథ రెడ్డి, ఎమ్మెల్యే మల్లిఖార్జున రెడ్డితో కలసి శుక్రవారం సుబ్బారెడ్డి ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలు, స్వామివారి కల్యాణోత్సవం నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
15న ఒంటిమెట్ట రామయ్య కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
Advertisement
తాజా వార్తలు
Advertisement