Friday, November 22, 2024

తక్కువ రేట్లకే ఆన్‌లైన్‌ సినిమా టిక్కెట్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే సినిమా టిక్కెట్లు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టి తక్కువ ధరకే ప్రేక్షకులకు వినోదం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏపీఎఫ్‌డీసీ పోర్టల్‌ ‘యువర్‌ స్క్రీన్స్‌’ను అందుబాటులోకి తీసుకురానుందని రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ టీ.విజయ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. యువర్‌ స్క్రీన్స్‌ పోర్టల్‌లో టిక్కెట్టు బుక్‌ చేసుకుంటే ప్రేక్షకులపై ఏ విధనమై అదనపు భారం పడదన్నారు. థియేటర్‌ యజమానులు అపోహలకు పోకుండా ప్రేక్షకులకు తక్కువ రేట్లకు సినిమా టిక్కెట్లు అందించేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు సహకరించాలన్నారు.

అదనపు ఖర్చు ఉండదు కొత్త సినిమాల విడుదల సమయంలో యువర్‌ స్క్రీన్స్‌ ద్వారా తక్కువ రేట్లకే టిక్కెట్లు బుక్‌ చేసుకొని కుటుంబం వినోదాన్ని ఆస్వాదించొచ్చని విజయ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇతర పోర్టల్స్‌లో బుక్‌ చేసుకుంటే టిక్కెట్‌పై రూ.20 నుంచి రూ.25 వరకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్న తరుణంలో అడ్డుకట్టకు ప్రభుత్వం కేవలం రూ.1.95 చార్జీ మాత్రమే వసూలు చేస్తుందన్నారు. ఇతర పోర్టల్స్‌తో పోల్చితే ప్రేక్షకుడు తీసుకునే ఒక్కొక్క టిక్కెట్టుపై రూ.25 వరకు భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement