Tuesday, November 19, 2024

Student Suicide: ఆన్ లైన్ రుణ వేధింపులు… డిగ్రీ విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం…

ఆన్‌లైన్ రుణాలు ఈ మ‌ద్య కాలంలో య‌మ పాశాలుగా మారుతుంది. వారి వేధింపుల‌ను తాళ‌లేక ఎంతో మంది తనువులు చాలిస్తున్నారు. తాజాగా ఆన్ లైన్ రుణ వేధింపులు తాళలేక ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఎర్రగుంట తండాలో చోటుచేసుకుంది. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడం, ఇంటికి వచ్చి బెదిరించడంతో మానసికంగా కృంగిపోయిన ఆ విద్యార్థి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

డిగ్రీ విద్యార్థి బాలస్వామి నాయక్ గత ఏడాది ఆన్ లైన్‌లో రుణం తీసుకున్నాడు. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడంతో బాలస్వామి రుణం చెల్లించ లేకపోయాడు. దీంతో ఆన్ లైన్‌ ఫైనాన్స్ సంస్థలు బాలస్వామి స్నేహితులకు ఫోన్లు చేసి వేధించాయి. ఇటీవల ఎర్రగుంట తండాలోని బాలస్వామి ఇంటికి వచ్చి ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు బెదిరించారు. దీంతో మానసికంగా కృంగిపోయిన బాలస్వామి గత జనవరి 26న ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. జనవరి 26న ఇల్లు వదిలి వెళ్లిపోయిన బాలస్వామి నాయక్ జాడ కుటుంబసభ్యులకు తెలియరాలేదు. ఎర్రగుంట తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో డిగ్రీ విద్యార్థి బాలస్వామి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి మృతితో మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement