అమరావతి : ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడి అప్పులపాలై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది. నరసరావుపేటలో కూరగాయల వ్యాపారం చేసుకునే కనుపోలు ఉదయ్‌కిరణ్(32) అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు.
బెట్టింగ్‌లో రూ.10లక్షలు పోగొట్టుకోవడంతో అప్పుల బారిన పడ్డాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.