Friday, November 22, 2024

ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించాలి: రైతులు నిరసన

ఉల్లి కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించి రైతులను కార్మికులను ఆదుకోవాలి ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. కర్నూలులో రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో బోరుబావుల కింద మెట్ట భూములలో సుమారు 30 వేల ఎకరాలు ఉల్లి పంట సాగు చేశారని తెలిపారు. పండిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేక రోడ్ల వెంట తిరిగి అమ్ముకునే ఇటువంటి దుస్థితి రైతులకు ఏర్పడింది ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు హైదరాబాద్ మార్కెట్ కు తీసుకెళ్లినా.. అక్కడ కూడా ధర లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ జోక్యం చేసుకుని చేసుకుని ఉల్లి పంటను కొనుగోలు చేయాలని కోరారు.  ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. అసలేం జరిగింది?

Advertisement

తాజా వార్తలు

Advertisement