Wednesday, November 20, 2024

ఈ నామ్ పద్ధతిలో నష్టం.. ఉల్లి రైతుల ఆవేదన

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రైతులు ఉల్లిగడ్డలు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఉల్లిగడ్డలు పచ్చి సరుకు ఈనాం ద్వారా గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. శుక్రవారం(అక్టోబర్ 22) ఈనాం ద్వారా ఉల్లిగడ్డలు కొనుగోలు చేశారు. ఈనాం ద్వారా ఒక్క లాటుకు 370 రూపాయలు పోతే, అదే బహిరంగ టెండరు ద్వారా 1700,1800 రూపాయలకు కొనుగోలు చేశారు. పచ్చి సరుకు ఈనాం టెండరు రైతులు గిట్టుబాటు ధర లేక నష్ట పోతున్నారు. ఈ ఈనాం పద్దతి ద్యార కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు, మార్కెట్ కమిటీలో పనిచేసే కూలీలు ఇబ్బంది పడుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఉంటేనే అమ్ముకునే అవకాశం ఉంది, తప్ప, గిట్టుబాటు ధర లేక ఇతర ప్రాంతాలకు ఉల్లిగడ్డలు తరలిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, జోక్యం చేసుకుని ఉల్లిగడ్డలు, బహిరంగ వేలం పాట ద్వారా రైతులకు గిట్టుబాటు కల్పించాలని ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కె.బలరాం కోరారు.

ఇది కూడా చదవండి: కర్నూలులో విషాదం.. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement